అన్నపై చెల్లి పోటీ!

0vijayashanti-and-kcrరాజకీయాల్లో బంధువులు, బంధుత్వాలు ఉండవు అని అంటారు. అది నిజమే అని గతంలో పలు సార్లు ఋజువు అయ్యింది. సొంత అన్న తమ్ముళ్లు, అన్న చెల్లెలు గత ఎన్నికల్లో పోటీలో దిగిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి మెదక్‌ పార్లమెంటు నియోజక వర్గంలో రసవత్తర పోరుకు రంగం సిద్దం అవుతోంది. దేవుడిచ్చిన అన్నగా కేసీఆర్‌ను గతంలో పలు సార్లు చెప్పుకున్న విజయశాంతి తాజా ఎన్నికల్లో ఆయనపైనే పోటీకి సిద్దం అవుతోంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుంది అని భావించి కేసీఆర్‌తో పోటీ ఆలోచన చేయని రాములమ్మ తాజాగా రెండు పార్టీలు విడివిడిగా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌కి పోటీగా మెదక్‌ నుండి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు విజయశాంతి వెళ్లడిరచారు.

తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు అని ప్రకటించిన కేసీఆర్‌ తాను పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే గతంలో పోటీ చేసిన స్థానం నుండి కాకుండా మెదక్‌ నుండి కేసీఆర్‌ పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మెదక్‌కు విజయశాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో కేసీఆర్‌కు పోటీగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా మెదక్‌ నుండే రాములమ్మ పోటీ చేయబోతుంది. పార్టీ నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తాను అని విజయశాంతి వెళ్లడిరచారు. మెదక్‌ గడ్డపై అన్న చెల్లెల సవాల్‌ జరుగబోతుందన్నమాట.