డాక్టర్లు చెప్పినా తగ్గని విజయశాంతి.. ఏమైంది?

0Vijayashanthi-wanted-make-acting-comeback-soonటాలీవుడ్ లేడీ అమితాబ్ గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించిన మాజీ హీరోయిన్ విజయశాంతి ఆ మధ్య రాజకీయాల్లో బిజీబిజీగా గడిపేసిన విషయం తెలిసిందే. అయితే, తర్వాత రాజకీయాలు కాస్తా బెడిసికొట్టడంతో తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిపోయినట్లు న్యూస్ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం ఓ భారీ సినిమాతోనే విజయశాంతి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని, గతంలో మాదిరిగానే ఓ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తారని టాక్ వచ్చింది. అనంతరం దాని గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తాజాగా విజయశాంతి ఉన్నట్టుండి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడం చర్చనీయాంశం అయింది. అందుకే ఏమైందని ఆరా తీస్తే.. కొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. ఆ విషయాల్లోకి వెళితే, తన రీఎంట్రీ మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడే విజయశాంతి కాలికి ఫ్రాక్చర్ అయిందని సమాచారం. అంతేకాకుండా లిగ్మెంట్ కదలడంతో సుదీర్ఘకాలం పాటు చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అలాగే విజయశాంతి పాదానికి కూడా కొన్ని ఆపరేషన్స్ చేశారట. ఇదంతా ఒక్కసారిగా విజయశాంతి సినిమా కోసం హెవీ వర్కౌట్స్ చేయడం కారణంగానే జరిగిందట. ఈ కారణంగా ఇప్పుడు డాక్టర్లు కూడా ఇకపై పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించి మరీ విజయశాంతిని డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
 
కానీ, డాక్టర్లు చెప్పినా ఏమాత్రం తగ్గని విజయశాంతి ఇప్పుడు తిరిగి వర్కౌట్స్ మొదలుపెట్టేసిందని సన్నిహితులు చెబుతున్నారు. అదీకాకుండా కొన్ని వారాలు మాత్రమే విశ్రాంతి తీసుకున్న విజయశాంతి ఇప్పుడు రోజుకు రెండున్నర గంటల పాటు జిమ్ లో గడుపుతూ వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలియడం షాక్ ఇస్తోంది. ఇదే సమయంలో పాదంపై భారం పడకుండా విజయశాంతి జాగ్రత్తపడుతూనే.. హెవీ వర్కౌట్స్ చేస్తున్నట్లు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ లెక్కన విజయశాంతి తన రీఎంట్రీని బలంగానే చూపించడానికి సిద్ధమవుతున్నారని అర్థమైపోతుంది. ప్రస్తుతానికైతే, ఈ కొత్త సినిమా ఇంకొన్ని నెలల్లోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ రీఎంట్రీ ఏ రేంజ్ లో ఉంటుందో త్వరలోనే చూడాలి.