మల్టీఫ్లెక్స్ లపై బెజవాడ కోర్టు సంచలన తీర్పు!

0మహారాష్ట్రలో మై పుడ్.. మై మూవీ ఉద్యమానికి సానుకూలంగా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మల్టీఫ్లెక్సుల్లో ఆహార దోపిడీకి చెక్ చెబుతూ.. ఎవరింటి ఫుడ్ వారు థియేటర్ కు తీసుకెళ్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశంపై తెలంగాణ తూనికలు కొలతల శాఖ నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు షురూ చేసింది. ఇలాంటివేళ.. మరో అడుగు ముందుకు వేస్తూ.. బెజవాడ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

విజయవాడలోని మల్టీఫ్లెక్సుల్లో అధిక ధరలకు ఆహార పదార్థాలు అమ్మటంపై వినియోగదారుల ఫోరం జడ్జి మాధవరావు సంచలన తీర్పును వెల్లడించారు. భారీ ధరలకు ఫుడ్ అమ్మే మల్టీఫ్లెక్సులకు ఒక్కొక్కంటికి రూ.5లక్షల భారీ జరిమానా విధించారు.

అంతేకాదు.. ప్రజలు బయట నుంచి తెచ్చుకునే ఆహారపదార్థాలు.. తాగునీటికి అనుమతి ఇవ్వాలన్న ఆదేశాల్ని జారీ చేశారు. తమ ఆదేశాల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరి.. ఈ తీర్పును స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ.. ఏపీ ప్రభుత్వాలు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తారేమో చూడాలి.