సుక్కు హిందీ చిత్రాన్ని ఆయన కన్ఫర్మ్ చేశారు

0తెలుగులో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ హిందీలోకి అడుగు పెట్టబోతున్నానే విషయం ఎప్పట్నుంచో వినిపిస్తోంది. 100%లవ్ చిత్రాన్నే ఆయన హిందీలో రీమేక్ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత సుక్కు తెలుగులోనే బిజీ కావడంతో హిందీ గురించి ఆలోచించలేదు. అయితే రంగస్థలం తర్వాత మళ్లీ సుక్కు బాలీవుడ్ ఎంట్రీ గురించి పెద్దయెత్తున చర్చ మొదలైంది. మహేష్ తో సినిమా చేశాకే హిందీలోకి వెళతారని కొందరంటే – అంతకుముందే వెళతారని మరికొంతమంది మాట్లాడుకున్నారు. కానీ ఈ విషయం గురించి సుక్కు మాత్రం పెదవి విప్పడం లేదు.

అయితే ప్రముఖ రచయిత – దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాత్రం సుక్కు బాలీవుడ్ ఎంట్రీని పక్కాగా కన్ఫర్మ్ చేశారు. సుకుమార్ హిందీలో ఓ రీమేక్ చిత్రం చేయబోతున్నారని – దానికి తాను సమర్పకుడిగా వ్యవహరించబోతున్నానని విజయేంద్రప్రసాద్ చెప్పారు. మరి ఏ చిత్రాన్ని సుక్కు హిందీలో రీమేక్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 100% లవ్ సినిమానే చేస్తారా లేదంటే మరో సినిమానా అనేది తేలాల్సి ఉంది. అయితే ఆ సినిమా మాత్రం యువ కథానాయకుడు వరుణ్ధావన్తో ఉండొచ్చని తెలుస్తోంది. 1 (నేనొక్కడినే) – ఆర్య చిత్రాల్లో ఏదో ఒకటి రీమేక్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదనేది టాలీవుడ్ వర్గాల మాట. మరి సుక్కు పెదవి విప్పితే తప్ప ఆ విషయంపై పక్కా క్లారిటీ వచ్చే అవకాశం లేదు.