ఈరోస్ సెట్టింగ్ సూపర్ స్టార్ కోసమేనా?

0ఒక్కోసారంతే.. న్యూస్ చదివే సమయంలో ఉన్నదున్నట్టు కాకుండా అంతరార్థం గ్రహించమని కొందరు పెద్దలు చెబుతారు. ఈ జేనేరేషన్ కు అర్థమయ్యేలా ఇంగ్లీష్ లో చెప్తే ‘రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్’. మరి నిన్నొక వార్త వచ్చింది. అదేంటంటే సీనియర్ రైటర్ KV విజయేంద్ర ప్రసాద్ తో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ఓ పది సినిమాల కాంట్రాక్టు కుదుర్చుకున్నారని. అందులో ఒక సినిమాకు సుకుమార్ డైరెక్టర్ అన్నారు.

కొంతమందేమో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సినిమాకు సుకుమార్ డైరెక్టర్ అని చెప్తే.. మరి కొందరు మాత్రం వరుణ్ ధావన్ ప్రాజెక్ట్ ఒకటి సుకుమార్ ప్రాజెక్ట్ మరొకటి.. రెండిటికి విజయేంద్ర కథను అందిస్తారని అన్నారు. సో.. ఈ అప్డేట్ ప్రకారం విజయేంద్ర సుకుమార్ కు కథ అందించడం అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. మరి సుకుమార్ తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేస్తాడని వార్తలు వచ్చాయి. మైత్రీనే ఆ సినిమాను నిర్మిస్తుందని ప్రకటించారు కూడా. తర్వాత సుక్కు చెప్పిన స్టొరీలైన్ నచ్చక ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిందని కూడా కొన్ని గాసిప్స్ వినిపించాయి. ఇప్పుడు తాజా అప్డేట్లను బట్టి మహేష్ బాబు-సుకుమార్ సినిమాకే విజయేంద్ర కథ అందిస్తాడని కొత్త లాజిక్ బయటకు వచ్చింది.

దీంతో ఆ సినిమా దాదాపు పక్కా అయినట్టేనని – ఎందుకంటే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వద్ద మహేష్ కాల్ షీట్స్ ఉన్నాయట. ఈరోస్ వారు 14 రీల్స్ ద్వారా ఆ ప్రాజెక్టును టేకప్ చేస్తారని అంటున్నారు. కానీ ఒకే ఒక్క అనుమానం ఏంటంటే.. సుక్కు తన కథలను తనే రాసుకుంటాడు. తన టీమ్ సహాయంతో డెవలప్ చెసుకుంటాడు. జక్కన్న 2.0 లాగా ప్రతి సీను శ్రద్ధగా నెలల తరబడి చెక్కుతాడు. మరి అయన విజయేంద్ర కథకు సరే అంటాడా? సరే అనే అవకాశం అయితే ఉంది ఎందుకంటే విజయేంద్ర లాంటి సీనియర్ రైటర్ ఉంటే తన పని సగం తగ్గినట్టే కదా! ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం.