విజేత పోస్టర్ టాక్: భలే నీట్ గా ఉందండీ

0టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమా తో తనదైన శైలిలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. ఎన్నో నెలల నుంచి కథ చర్చలతో నడిచిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా ఊపందుకుంది. అలా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ప్రమోషన్స్ ను కూడాస్టార్ట్ చేశారు.

సినిమాకు సంబందించిన మొదటి పోస్టర్ లో మెగా అల్లుడు చితకొట్టేశాడు అని ఒక నేమ్ వచ్చేసింది. ఇక ఇప్పుడు మరోక పోస్టర్ తో స్పీడ్ పెంచాడు అనే టైటిల్స్ వస్తున్నాయి. ఈ నెల 12న 8 గంటల 59నిమిషాలకు టీజర్ రానున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. విజేత సినిమా తండ్రి కొడుకుల అనుబంధం మధ్య సాగుతుంది. ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కదిలించడం పక్కా అని తెలుస్తోంది.

ఇక దర్శకుడు రాకేష్ శశి సింపుల్ గా కళ్యాణ్ దేవ్ బాడీ లాగ్వేజ్ కి తగ్గట్టుగా కథను మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలపాటు ఈ దర్శకుడు కళ్యాణ్ తో ట్రావెల్ చేశాడు. ఇద్దరు కలిసి బ్యాక్ గ్రౌండ్ వర్క్ బాగానే చేశారు. ఇప్పుడిచ్చిన స్టిల్ చూస్తుంటే అర్ధమవుతోంది సినిమా ఎంత నీట్ గా ప్లాన్ చేశారో అని. మరి అనుకున్నంత రేంజ్ లో ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.