విజయ్ కొత్త సినిమాకి క్లాఫ్

0అర్జున్ రెడ్డి తర్వాత విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ఏదీ ప్రేక్షుకుల ముందుకు రాలేదు. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయిక. ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘టాక్సీవాలా’ మే 18న విడుదలకు సిద్ధమైంది.

ఇప్పుడు మరో కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది, ఈ సినిమాకు తమిళ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు. . తమిళ్ తెలుగులో నిర్మించబోయే ఈ సినిమాలో మెహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. రేపు ఈ సినిమా ప్రారంభం హైదరాబాద్ లో జరగనుంది. ముహూర్తం నాడు ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు ప్రకటిస్తారు.