విక్రమ్ ధృవ నక్షత్రం ఫస్ట్ లుక్

0dhruva-natchathiram-movie-first-lookకోలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ప్రేమలోని డిఫరెంట్ పాయింట్స్ ను టచ్ చేయడం మాత్రమే కాదు.. అంతకంటే మిన్నగా యాక్షన్ మూవీస్ తీసేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా మలచడం ఈ దర్శకుడి స్టైల్.

అలాగే చియాన్ విక్రమ్ కూడా డిఫరెంట్ కేరక్టర్లకు కేరాఫ్ అడ్రస్. తను చేసే ఒక్కో పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు. విక్రమ్ కంటే ఎక్కువగా మేకోవర్ చేయగలిగిన నటుడు దేశంలోనే మరొకళ్లు కనిపించరంటే ఆశ్చర్యం వేయకమానదు. ఇప్పుడు విక్రమ్-గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ ప్రారంభమైంది. అదే ధృవ నక్షత్రం. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది కానీ.. రీసెంట్ గానే మొదలైంది. ప్రారంభించుకున్న రోజునే ఫస్ట్ లుక్ రివీల్ చేసి ఆశ్చర్యపరిచింది యూనిట్.

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సూట్ వేసుకన్న విక్రమ్ ను చూస్తే.. ఓ జేమ్స్ బాండ్ ని చూసినట్లు అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అన్నట్లు ఈ మూవీ కూడా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ లోనే తెరకెక్కనుండడం విశేషం. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ఆగస్ట్ 2017 అంటూ రిలీజ్ పై హింట్ ఇచ్చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్.. రిలీజ్ కి కౌంట్ డౌన్ మొదలైపోయిందంటూ ఆశ్చర్యపరిచాడు.