బన్నీ సినిమా కోసం ఎ.ఆర్.రెహమాన్

0చిరంజీవి `సైరా`కి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అనగానే మెగా అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ వేరే సినిమాలు చేతిలో ఉండటంతో అర్ధంతరంగా ఆయన ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో మెగా అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిరు సినిమాకి పనిచేయకపోయినా… బన్నీ కోసం ఆయన రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒక యాక్షన్ థ్రిల్లర్ కథతో తెరకెక్కించబోతున్నాడని.. ఇందులో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

తన సినిమాలకి రెహ్మాన్ తో సంగీతం చేయించుకోవడానికే ఇష్టపడుతుంటాడు విక్రమ్. ఈసారి కూడా ఆయనకే కథ వినిపించబోతున్నాడట. ఈ చిత్రాన్ని దక్షిణాదితో పాటు – హిందీలోకీ తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట విక్రమ్. అందుకే సంగీతం రెహ్మాన్ తోనే చేయించుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం కోసం పలువురు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లని కూడా రంగంలోకి దింపబోతున్నాడట విక్రమ్.