వినయ్‌శర్మపై విషప్రయోగం!

0దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడు వినయ్‌శర్మపై తీహార్‌ జైలులో విషప్రయోగం జరిగిందని అతడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

నిందితుడు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని బుధవారం ప్రత్యేక న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వినయ్‌శర్మకు విషపూరితమైన ఆహారం ఇచ్చారని, అతడు రక్తం కక్కుకున్నాడని తెలిపారు. దీనిపై స్పందించిన ప్రత్యేక కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి యోగేష్‌ ఖన్నా తీహార్‌ జైలు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వినయ్‌శర్మకు వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. అతడికి సరైన వైద్య సేవలు అందించాలన్నారు. నిందితుడిపై విషప్రయోగం జరిగిందన్న వాదనను తీహార్‌ జైలు అధికార ప్రతనిధి ఖండించారు.