వినయ విధేయ రామ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

0

రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ జనవరి 11 న విడుదలయింది. ఈ సినిమా నిన్నటికి వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ 56.79 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 50 కోట్ల మార్కును దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో రూ. 50 కోట్ల మార్కును దాటిన 8 వ సినిమాగా నిలిచింది.

కానీ బ్రేక్ ఈవెన్ కు మాత్రం ఈ కలెక్షన్స్ ఫిగర్స్ చాలా దూరంగా ఉన్నాయి. ‘వినయ విధేయ రామ’ థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లకు పైగా అమ్ముడుపోవడంతో ఈ సినిమా ఆ మార్కును చేరుకునే అవకాశం లేదు. దీంతో డిజాస్టర్ గా నిలవడం మాత్రం ఖాయమే. ఇప్పటివరకూ 56 కోట్ల రూపాలు సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ. 60 కోట్ల రూపాయల మార్కును టచ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో ‘వినయ విధేయ రామ’ ఏరియా వైజ్ వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 12.05 cr

సీడెడ్: 11 cr

ఉత్తరాంధ్ర: 6.63 cr

కృష్ణ: 3.37 cr

గుంటూరు: 6.06 cr

ఈస్ట్ : 4.57 cr

వెస్ట్: 3.78 cr

నెల్లూరు: 2.63 cr

టోటల్: రూ. 50.09 cr (ఎపీ+తెలంగాణా)

రెస్ట్ అఫ్ ఇండియా : 5.27 cr

ఓవర్సీస్: 1.43 cr

వరల్డ్ వైడ్ టోటల్ (షేర్): రూ. 56.79 cr
Please Read Disclaimer