వినోద్‌ ఖన్నా ఇక లేరు

0Vinod-Khanna-recentప్రముఖ బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా ఇకలేరు. 70 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. 1968లో వచ్చిన ‘మన్‌ కా మీట్‌’ చిత్రం ద్వారా వినోద్‌ ఖన్నా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన సినీ ప్రస్థానం బాలీవుడ్‌లో అప్రతిహాతంగా కొనసాగింది. 2015 వరకు దాదాపు 140 చిత్రాల్లో ఆయన నటించారు. ‘మేరే గావ్‌ మేరా దేశ్‌’, ‘గద్దర్‌’(1973), ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘రాజ్‌పుత్‌’, ‘ఖుర్బానీ’, ‘దయావన్‌’ తదితర చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచుకున్నారు. చివరిసారిగా దిల్‌వాలే చిత్రంలో కన్పించారు.

సినిమాల్లోనే కాక రాజకీయ రంగంలో కూడా వినోద్‌ ఖన్నా రాణించారు. ప్రస్తుతం గుర్‌దాస్‌పూర్‌ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన ఫొటో మీడియాలో వైరల్‌గా మారింది.