ఇండియా-పాక్ మ్యాచ్ లోనూ బాహుబలి

0


Virendra-Sehwag-Baahubaliబాహుబలి నామ జపం చేయడం ఇప్పుడు జనాలకు బాగానే అలవాటయింది. ఆ సినిమాలో కేరక్టర్లు అంతగా జనాలకు దగ్గరైపోయాయి. రియల్ లైఫ్ లో కూడా విస్తృతంగా ఉపయోగించేస్తున్నారు. బాహుబలి ఎంతగా ఫేమస్ అయిపోయిందంటే.. ఆఖరికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా బాహుబలి ప్రస్తావన తప్పలేదు.

ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్న టైంలో.. బాహుబలిని గురించి ప్రస్తావన రావడం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ముఖ్యంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే అంశంపై.. ఆసక్తికరమైన మాటలు సాగాయి. ఈ మ్యాచ్ లో కామెంటేటర్ గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. పలు మార్లు బాహుబలిని ప్రస్తావించాడు.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసింది కానీ.. రోహిత్ శర్మను విరాట్ కోహ్లి ఎన్నిసార్లు రన్ అవుట్ చేశాడంటే చెప్పడం మాత్రం కష్టమే’ అంటూ వ్యాఖ్యానించాడు సెహ్వాగ్.

ఇదే ప్రశ్న రోహిత్ శర్మ చెంతకు కూడా చేరింది. అయితే.. దీనికి సమాధానం దాటేసిన రోహిత్.. ఇండియన్ టీంలో కూడా ఓ బాహుబలి ఉన్నాడని చెప్పాడు. శిఖర్ ధావన్ కుమారుడు ఎప్పుడూ అందరినీ తెగ గుద్దేస్తూ ఉంటాడట. అందుకే అతడిని బాహుబలి అన్నాడు రోహిత్ శర్మ.