ఈ వారం తెలివితేటల సమరం

0ఒక్కోసారి అలా కలిసొచ్చేస్తాయంతే.. ఒకే జోనర్ కాదు కానీ.. ఒకే తరహా సినిమాలు రెండు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. రెండింటిలోను హీరో-విలన్ తెలివితేటలతో ఒకరినొకరు మట్టి కరిపించడం అనే సీక్వెన్స్ ల మధ్యే కథ సాగుతుంది.

నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఆఫీసర్. ఇందులో ముంబైకి ట్రాన్స్ ఫర్ అయిన పోలీసాఫీసర్ శివాజీ పాత్రలో నాగ్ కనిపించనుండగా.. అక్కడ విలన్ పాత్ర కూడా హై ప్రొఫైల్ కాప్ అయి ఉంటాడు. అత్యంత తెలివైన ఆ విలన్ ను హీరో ఎలా బోల్తా కొట్టించాడు.. అన్న యాంగిల్ లో సినిమా సాగుతుంది. అలాగే విశాల్ మూవీ అభిమన్యుడులో కూడా ఇంటెలిజెన్స్ అన్నదే మెయిన్ థీమ్. విలన్ గా అర్జున్ నటించగా.. ఇంటర్వెల్ వరకూ ఈ పాత్ర కనిపించదు. సెల్ ఫోన్ నుంచి డేటా చోరీ చేసి కమర్షియల్ గా క్రైమ్స్ కు వాడేసుకునే రోల్ ను ఇంటర్వెల్ తర్వాత రివీల్ చేస్తారు. ఇతడిని హీరో విశాల్ ఎలా ఫేస్ చేశాడన్నదే అభిమన్యుడు కథ.

నిజానికి ఆఫీసర్.. అభిమన్యుడు.. రెండు సినిమాలు ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేయాలి. అభిమన్యుడు తమిళ్ మాతృక రెండు వారాల క్రితమే విడుదల అయిపోయింది. కానీ తెలుగు వెర్షన్ ను లేట్ చేశారు. అలాగే ఆఫీసర్ మూవీ కూడా ఈ పాటికే థియేటర్లలో ఉండాలి. కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లెమ్స్ తో వారం వాయిదా పడింది. అలా వాయిదాల తర్వాత.. రెండూ ఒకే రోజుకు షెడ్యూల్ అయ్యాయి.