అనారోగ్యంపై విశాల్ క్లారిటీ

0హీరో,నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన స్పదించారు.

తనకున్న మైగ్రేన్ సమస్యకి జాగ్రత్తలు తీసుకుంటున్నాననీ .. త్వరలో పూర్తిగా నయమైపోతుందని చెప్పాడు. ఈ విషయంపై జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదనీ .. అదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అభిమాన్యుడు సినిమాలో నటిస్తున్నాడు విశాల్. ఇందులో సమంత హీరోయిన్.