విశాల్ సరే.. రానా సాయం ఏమైంది?

0ఆపత్కాళంలో ఆదుకునేవడు దేవుడు.. ప్రస్తుతం విశాల్ దేవుడినని నిరూపిస్తున్నాడు. అయితే విశాల్ ఫ్రెండు రానా మాత్రం ఇంకా బరిలో దిగలేదు. కేరళ వరదల వేళ ఇంత జరుగుతున్నా.. ప్రతిసారీ వెంటనే రెస్పాండ్ అయ్యే రానా ఎందుకిలా సైలెంటుగా ఉన్నాడు? రానాతో పాటు తెలుగు హీరోలు రెస్పాండ్ కాకపోవడానికి కారణం?

ఆపదలో నేనున్నానంటూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించే హీరోగా విశాల్ కి పేరుంది. ఇదివరకూ చెన్నయ్ వరదల్లో అతలాకుతలం అయినప్పుడు హీరో రానాతో కలిసి పేదలకు ఆహారం – కట్టుబట్టలు – నిత్యావసరాల్ని సరఫరా చేసి రియల్ హీరో అని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం అదే తరహా సాయం కేరళలోని వరద బాధితులకు చేస్తూ మరోసారి రియల్ హీరో అని నిరూపిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా కేరళలో 54 వేల మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. వారికి సహాయం చేసేందుకు విశాల్ కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలు సేకరిస్తున్నానని ట్విటర్ ద్వారా ప్రకటించారు.

వర్షాలతో ఇబ్బందుల్లో లో ఉన్న కేరళ వాసులను ఆదుకుందామని విశాల్ పిలుపునిచ్చాడు. కష్ట సమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందాం. వయనాడ్ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు రేపు చెన్నైలోని మహాలింగపురంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్ మెటీరియల్స్ ను తీసుకుంటాం. అందరూ నిత్యావసరాల్ని ఇవ్వండి అని కోరారు. విశాల్ మాదిరిగా తెలుగు స్టార్లు రెస్పాండ్ అవుతారేమో చూడాలి ఈ ఆపత్కాలంలో..