స్వల్ప గాయాలతో బయటపడ్డ హీరో

0Vishalఈ మధ్య కాలంలో హీరోలు షూటింగ్ లో ప్రమాదాల బారిన పడుతున్నారనే వార్తలు ఎక్కువగా వింటున్నాం. మొన్నటికి మొన్న షారూఖ్‌, ఆ తర్వాత మంచు విష్ణు, ఇప్పుడు తమిళ హీరో విశాల్. హీరో విశాల్ ప్రస్తుతం ‘తుప్పరివాలన్’ అనే చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. చిదంబరం సమీపంలోని పిచ్చాపురంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది.

మొన్న ఈ మధ్య కార్మికులు సమ్మె చేసినప్పటికి ఈ చిత్ర షూటింగ్ రెగ్యులర్ గానే జరుగుతూ వస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ లో విశాల్ అదుపు తప్పి పై నుండి క్రింద పడిపోయాడట. దీంతో ఆయనకి చిన్నపాటి గాయాలే అయ్యాయి తప్ప పెద్ద ప్రమాదం ఏం జరగలేదని యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.

కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోమన్నారని , త్వరలోనే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటానని విశాల్ చెప్పినట్టు సమాచారం. విశాల్ న‌టుడినే న‌డిఘ‌ర్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.