ఆ ముద్దు కోస‌మైనా చూస్తారు

0vishalవిశాల్‌, ల‌క్ష్మీమీన‌న్ జంట‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ చిత్రం తెర‌కెక్క‌తోంది. తిరు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యూటీవీ పిక్చ‌ర్స్‌, విశాల్ పిల్మ్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇంద్రుడు అనే పేరు ఖ‌రారు చేశారు. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తయింది. . యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని మ‌లుస్తున్నార‌ట‌. ల‌క్ష్మీమీన‌న్ – విశాల్ మ‌ధ్య స‌మ్ థింగ్ సమ్ థింగ్ న‌డుస్తోంది… అన్న వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో ఈ చిత్రానికి ఫ్రీ ప‌బ్లిసిటీ పెరిగింది. నిజ జీవిత జంట ఈ సినిమాలో ఎలా రొమాన్స్ పండించారో చూద్దామ‌న్న ఆత్రుత ఎక్కువైంది. దానికితోడు విశాల్‌- ల‌క్ష్మీమీన‌న్ మ‌ధ్య ఓ ఘూటైన ముద్దు సీన్ తెర‌కెక్కించారు. అందుకే ఇంద్రుడి కోసం.. తెలుగు, త‌మిళ జ‌నాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి యువ‌న్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.