చిన్మ‌యి, వైర‌ముత్తు వివాదంపై విశాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

0

తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి, తమిళ లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తుపై కొన్ని రోజులుగా చేస్తున్న ఆరోపణలు కోలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం అయ్యింది. చిన్మయి తనకు వైరముత్తుతో ఎదురైన చేదు అనుభవాలతో పాటు.. ఆయన బాధిత మహిళలు మరిందరి తరఫున గళం వినిపిస్తోంది. వాళ్లు చేసే ఆరోపణల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇంకా మరిందరు బాధితుల పక్షాన ఆమె పెద్ద ఉద్యమమే చేస్తోంది.

ఐతే వైరముత్తుకు కోలీవుడ్లో మంచి పేరుంది. ఈ కార‌ణంతోనే అనుకుంట‌ా అక్కడి ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. చాలామంది మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో నడిగర్ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ ఈ వివాదంపై స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

అంతే కాకుండా… అందరిలో కదలిక తెచ్చే ప్రయత్నం చేశాడని చెప్ప‌చ్చు. ఇంత‌కీ విశాల్ ఏమ‌న్నాడంటే… చిన్మయితో పాటు ఇంకొందరు మహిళలు చేస్తున్న ఆరోపణల్ని తాను గౌరవిస్తానని.. ఐతే ఇలాంటి విషయాల్లో సినీ రంగంలోని మహిళలు వెంటనే స్పందించాలని కోరాడు.




Please Read Disclaimer