శరత్ కుమార్ కూతురిపై ఆ హీరో కామెంట్

0తమిళంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకన్న తెలుగు నటుడు విశాల్ 40వ పడికి దగ్గర పడుతున్నాడు. కానీ ఇప్పటిదాకా అతను పెళ్లి చేసుకోలేదు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలు వరలక్ష్మితో అతను చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడని.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ అటు వైపు అడుగులు మాత్రం పడలేదు. ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి సంబంధాలున్నాయో తెలియదు. పెళ్లికి సిద్ధమైనపుడు ఇంకా ఎందుకు ఆగుతున్నారో తెలియదు. అలాగని వీళ్లిద్దరూ విడిపోయారన్న సంకేతాలు కూడా ఏమీ కనిపించడం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విశాల్.. వరలక్ష్మి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఆమె తన జీవితంలో చాలా ప్రత్యేకమన్నాడు. వరలక్ష్మి తనకు దక్కి భాండాగారమని అతను చెప్పడం విశేషం.

జీవితంలో మన కొరతలేంటో చెప్పేది కొందరే అని.. అలా తనకు లభించిన భాండాగారం.. తన మిత్రురాలు వరలక్ష్మి అన్నాడు విశాల్. ఆమె తనకు ఎనిమిదేళ్ల నుంచే తెలుసని.. తామిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని విశాల్ చెప్పాడు. వరలహమిలో ఎంతో ఆత్మవిశ్వాసం ఉందని.. ఆమె రాజకీయాల్లోకి రావాలని అతనన్నాడు. తన తప్పులు ఎత్తి చూపి మార్గదర్శిగా నిలిచిన వరు తన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి.. అత్యంత సన్నిహితురాలు అని విశాల్ చెప్పాడు. మంచి చెడు తనతో పంచుకుంటానని కూడా చెప్పాడు. ఇంతా చెప్పిన వాడు వరలక్ష్మితో తన ప్రేమను ధ్రువీకరించలేదు. పెళ్లి ఊసూ ఎత్తలేదు. ప్రస్తుతానికి తన లక్ష్యం నడిగర్ సంఘం భవన నిర్మాణమే అని చెప్పాడు. విశాల్ నటించిన కొత్త సినిమా ‘ఇరుంబుతురై’ శుక్రవారమే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. దీని తర్వాత అతను నటిస్తున్న ‘సెండైకోళి-2’ వరలక్ష్మి విలన్ పాత్ర చేయడం విశేషం.