తెలుగు అమ్మాయితో విశాల్ పెళ్లి..!

0టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. తెలుగులో ప్రభాస్ లానే తమిళంలో స్టార్ హీరో అయిన విశాల్ కూడా తన పెళ్లిని ఎప్పటికప్పుడూ వాయిదా వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. శరత్ కుమార్ కూతురితో ప్రేమ పెటాకులు అయ్యాక ఈ హీరో పెళ్లి చేసుకోవడానికి వెనుకాడుతున్నాడన్నది కోలీవుడ్ టాక్..

అయితే తాజాగా 40 ఏళ్లు ఉన్న విశాల్ ఓ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో వైరల్ అయ్యింది. చైన్నైలో పుట్టి పెరిగిన విశాల్ స్వస్థలం తిరుపతి జిల్లానే. వాళ్ల నాన్న – తాతలు తెలుగువారే..

తాజాగా విశాఖపట్నంలో పర్యటించిన విశాల్ ను పెళ్లిపై ప్రశ్నించింది తెలుగు మీడియా. అయితే కాలమే నా పెళ్లి చేయాలని వేదాంతం చెప్పి తప్పించుకున్నాడు విశాల్. అభిమన్యుడు తెలుగులో హిట్ కొట్టిన విశాల్ ఇప్పుడు తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఎంత వరకూ నిజమో చూడాలి మరి..