ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన విష్ణు

0

vishnu-target-NTR`ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా… `  అంటూ ఎన్టీఆర్ యమా సీరియస్ గా  డైలాగ్ చెబుతున్నాడు. మరో పక్క మంచు హీరో విష్ణు… `నన్ను కొట్టడానికి… నువ్వు గుడ్డలు ఊడదీసుకోవడం ఎందుకన్నాయ్` అని సెట్టైర్ వేస్తున్నాడు. ఈ రెండు డైలాగులు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ `రామయ్యా వస్తావయ్యా` సినిమాకోసం గుడ్డలూడదీసి కొడతా అనే డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్తో కూడిన టీజర్ చాలా రోజుల క్రితమే విడుదలైంది.

మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన `దూసుకెళ్తా` టీజర్ ఇటీవలే విడుదలైంది.అందులో బ్రహ్మానందం… విష్ణుతో `గుడ్డలూడదీసి కొడతా… ` అంటాడు. అప్పుడే విష్ణు… `నన్ను కొట్టడానికి నువ్వు గుడ్డలూడదీసుకోవడం ఎందుకన్నాయ్` అని కౌంటర్ డైలాగ్  చెబుతాడు. ఆ పంచ్ భలే పేలింది. ఎన్టీఆర్ `రామయ్యా వస్తావయ్యా` డైలాగ్ ని టార్గెట్ చేసుకొనే విష్ణు సినిమాలో డైలాగ్ రాశారని అంటున్నారు. ఎన్టీఆర్ సీరియస్ గా చెప్పిన డైలాగును డామేజ్ చేసేలా ఉందని అభిమానులు మనసు నొచ్చుకుంటున్నారు.

Tags : Vishnu Targets NTR,Manchu Vishnu Doosukeltha movie Trailer,NTR Ramayya Vasthavyya Movie Trailer,Manchu Vishnu Vs NTR


Please Read Disclaimer