60లో 20 చూపిస్తున్న హీరో

0ఇంతకీ మీ వయసెంత? సరిగ్గా ఐదేళ్ల క్రితం `విశ్వరూపం` రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. వయసును ఎలా దాచేయగలుగుతున్నారు? అని ప్రశ్నిస్తే – విశ్వనటుడు కమల్ హాసన్ స్పందన ఇలా ఉంది. “అవును.. నిజమే.. మీరు కూడా అప్పుడెలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు!“ అంటూ ఆ ప్రశ్న అడిగిన సీనియర్ జర్నలిస్టుపైనే పంచ్ వేశారు ఉలగనాయగన్. పంచ్లు వేయడంలో కమల్ హాసన్ టైమింగ్ ఏ రేంజులో ఉంటుందో ఆ ఒక్క సన్నివేశం చాలు గ్రహించేందుకు. హైదరాబాద్ ప్రెస్ మీట్ లో సరదా సన్నివేశమిది. ఆగస్టు 10 రిలీజ్ సందర్భంగా పాత్రికేయ బృందంతో మాట్లాడిన కమల్ ఇలాంటి సరదా జోకులెన్నో వేస్తూ హాయిగా మాట్లాడేశారు.

అసలు ఆయన వయసెంత? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ కమల్లోని ఆ గ్లామర్ కించిత్ కూడా తగ్గలేదు. `భారతీయుడు` సినిమాలో యంగ్ కమల్ హాసన్ నే ఇప్పటికీ మెయింటెయిన్ చేస్తున్నారు. అదే స్టైల్.. అదే ఆర్మీ హెయిర్ కటింగ్ తో హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఇంటరాక్ట్ అయ్యారు. ఆయన దశావతారాల్లో ఇదో అవతారంరా బాబూ అనుకున్నారంతా.

లేటెస్టుగా రిలీజైన `విశ్వరూపం 2` తమిళ్ మేకింగ్ వీడియో చూస్తే ఆయన వయసు 20 అయ్యి ఉంటుంది.. అనకుండా ఉండలేం. అంత ఇంప్రెస్సివ్ గా కనిపిస్తున్నారు ఈ వీడియోలో. ఆన్ లొకేషన్ భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఆయన దూకుడు చూస్తుంటే అసలు 60 వయసు ఉంటుందా? మెగాస్టార్ – నాగార్జున – మోహన్ బాబు వంటి వారికి ఈయన సమకాలికుడా? అన్న సందేహాలు కలగక మానవు. అందుకేనేమో ఆయన్ని ఎవ్వర్ గ్రీన్ లవర్ బోయ్ గానే చూస్తోంది ఈ లోకం. అన్నట్టు విశ్వరూపం ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే అటూ ఇటూ కూచున్న ఇరువురు భామలు పూజా కుమార్ – ఆండ్రియాల వయసు 30కి అటూ ఇటూ. అంటే తనలో సగం వయసున్న భామలతో కమల్ ఓ రేంజులో రొమాన్స్ చేస్తున్నారన్నమాట!!