శ్రీ రెడ్డి తో వైవా హర్ష కూడానట..

0ప్రస్తుతం శ్రీ రెడ్డి పేరు మీడియా లో మారుమోగిపోతుంది..సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయిందని , తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వకుండా తిప్పుతున్నారని ఆమె నిరసనలు చేస్తూ కొన్ని వీడియోలను , తనతో చాట్ చేసిన వాటిని బయటపెడుతూ సంచలనం రేపుతోంది. ఇప్పటికే కొంతమంది వ్యక్తుల రహస్య చాట్ లను బయటపెట్టిన ఈమె , తాజాగా వైవా హర్ష చాట్ ను బయటపెట్టింది.

యూ ట్యూబ్ ఛానల్‌లో, షార్ట్ ఫిలిమ్స్‌లో నటించేందుకు హెల్ప్ చేయమని శ్రీరెడ్డి.. వైవా హర్షను కోరిందట.. అపుడు అతను దీన్ని అవకాశంగా తీసుకుని తనతో దరిద్రంగా ఛాట్ చేశాడని తెలిపింది. సాయం కోసం వెళితే.. చిన్న నటులు కూడా ఇలా ఛండాలంగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది. వైవా హర్షతో జరిపిన వాట్సాప్ ఛాట్‌ను స్క్రీన్ షాట్ తీసి తన ఫేస్‌బుక్ పేజిలో పోస్ట్ చేసింది..మీరు కూడా ఆ చాట్ ఫై లుక్ వెయ్యండి.