చరణ్ మూవీ ఫై వివేక్ ఒబేరాయ్ కామెంట్స్

0‘రంగస్థలం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంకు సబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బోయపాటి తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. రాజకుటుంబం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన లుక్ కాని కథకు సంబంధించిన చిన్న క్లూ కాని అధికారికంగా బయటకు రాలేదు. దాంతో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో వివేక్ ఒబేరాయ్ కనిపించబోతున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణను అజర్ బైజాన్ దేశంలో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ ఏ చిత్రం కూడా చిత్రీకరణ జరుపుకోలేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అద్బుతమైన లొకేషన్స్ తో పాటు అక్కడ ప్రజలు – ప్రతి ప్రదేశం కూడా పౌరుషానికి ప్రతీక అంటూ చెబుతూ ఉంటారు. ఒక గొప్ప చరిత్ర ఉన్న దేశంగా అంజర్బైజాన్కు మంచి పేరు ఉందట. అంలాంటి దేశంలో చిత్రీకరణ జరుపుకుంటున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో నటుడు వివేక్ ఒబేరాయ్ అక్కడ లొకేషన్స్‌లో ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఫొటోతో పాటు సినిమాపై అంచనాలు పెరిగేలా కామెంట్ చేశాడు.

బ్రదర్ రామ్ చరణ్ మంచి ప్రతిభ ఉన్న నటుడు చరణ్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇక దర్శకుడు బోయపాటి అద్బుతంగా యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తూ చంపేస్తున్నాడు. ప్రతీ సీన్ కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసి ఎంజాయ్ చేయవచ్చు అంటూ వివేక్ ట్వీట్ చేశాడు. సినిమాను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు రెడీగా ఉండండి అంటూ వివేక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.