రోడ్డున పడబోతున్న ఐడియా , వొడా ఉద్యోగులు

0జియో దెబ్బ కు అన్ని సంస్థలు ఏకం కాబోతున్నాయి..ఒకటిగా నష్టాలూ చవిచూడడం బదులు మరో సంస్థలో విలీనం అయి నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే ఎయిర్ సెల్ , ఎయిర్ టెల్ లో కలువగా , తాజాగా వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యూలార్‌లు ఒకటి కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి విలీన ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లే తెలుస్తోంది.

ఈ విలీనం కారణం గా ఆయా కంపెనీలలో పనిచేసే ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ రెండు సంస్థలు ఒకటైన తర్వాత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించుకున్నాయట. రానున్న రెండు నెలల్లోనే ఈ రెండు సంస్థల నుంచి 5వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్లు సమాచారం. అంటే అంతమంది రోడ్డున పడబోతున్నారన్నమాట. ప్రస్తుతం రెండు కంపెనీల్లో కలిపి 21వేల మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో పావు వంతు అంటే దాదాపు 5వేల మందిని ఉద్యోగాల నుండి తీసివేస్తారని సమాచారం.