హాటుగా ఉన్న రకుల్ కు ఓటేస్తారా??

0ఓటు వేయడం అంటే గతంలో జనాలకు ఓ లెక్కుంది. పాలిటిక్స్ లోనే ఎక్కువగా ఈ పదం ఉపయోగించేవారు. కానీ ఆన్ లైన్ పోల్స్ మొదలయ్యాక.. దేనికి వేయమంటున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి. ఈ మధ్య ఎవరైనా సరే ఒపీనియన్ మీద పోలింగ్ చేపట్టేసే మహద్భాగ్యాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ కల్పించిన తర్వాత.. ఓటు అన్న పదానికి మరీ వాల్యూ పడిపోయింది.

ఇక విషయానికి వస్తే.. హాట్ నెస్ కి ఓటు వేయండంటూ ఓ మ్యాగజైన్ పోలింగ్ చేపట్టింది. అందగత్తెల షోకులను కవర్ పేజ్ లపై.. లోపలి పేజీల్లో తెగ చూపించేసే ఈ సంస్థ.. ఇప్పుడు జస్ట్ ఓ 100 మంది సుందరాంగులను సెలెక్ట్ చేసుకుని.. వారి ఫోటోలతో కలిపి ఓ పోర్టల్ కూడా స్టార్ట్ చేసేసి.. ఓటింగ్ మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా మన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ కు.. నెంబర్ వన్ హాట్ బ్యూటీ అని ఓటేయాలంటే.. ఫలానా పేజ్ ను విజిట్ చేయమంటూ.. ఓ పోస్ట్ చేయగా.. ఈ ఫోటోలో రకుల్ పిచ్చ హాటుగా కనిపిస్తుంది.

తనకు ఓటేయమంటూ రకుల్ ప్రీత్ కూడా ఈ పోస్టును రీట్వీట్ చేయడం విశేషం. సింపుల్ గా చెప్పాలంటే.. ఇది ఓ అనఫీషియల్ అందాల పోటీ అన్నమాట. మరి అందులో తను నెగ్గాలంటే.. ఓట్లు పడాలి కదా. అందుకే తన హాట్ హాట్ ఫోటోకు ఓటేయమంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మరి సెగలు పుట్టించే రకుల్ ఫోటోను చూసి ఊరుకుంటారో.. లేక ఓటు కూడా వేస్తారో మీ ఇష్టం.