బూతు వ్యాఖ్యలతో హీరోయిన్ పై దాడి

0జనం మధ్యకు హీరోయిన్స్ వచ్చినప్పుడు వారి పై రకరకాల కామెంట్స్ చేస్తూ ఉండటం చాలామందికి అలవాటు. అయితే వెబ్ మీడియా సాక్షిగా ఒక హీరోయిన్ బూతు మాటలతో వేధించిన సంఘటన ఈమధ్య వెలుగులోకి వచ్చింది. ‘రౌడీ ఫెలో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విశాఖ సింగ్ కు ఈ సంఘటన ఎదురైంది. 
 
ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో తమిళ హిందీ సినిమాలను చేసుకుంటూ కాలం గడుపుతున్న విశాఖ సింగ్ యూత్ లో తన క్రేజ్ ను పెంచుకోవడానికి తన ఫేస్ బుక్ లో సందడి చేస్తూ తరుచు తన అభిమానులతో ఛాట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈమెకు ఈ ఊహించని సంఘటన ఎదురైంది. VISAKA-SINGH
 
ఈమధ్య ఈ బ్యూటీ ‘Everybody is somebody’s foreigner’ అనే క్యాప్సన్ ఉన్న ఫోటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అయితే కొందరు అత్యుత్సాహంతో ఆ ఫోటో పై బూతు కామెంట్లు వల్గర్ జోక్స్ వేసారు. అంతేకాదు ఆమె వక్షోజాల గురించి అసభ్యంగా కామెంట్లు చేసారు. దీనితో తిక్కరేగిన విశాఖ సింగ్ చాల ఘాటుగా సమాధానం ఇచ్చింది. ‘నీ తల్లికి, చెల్లికి, భార్యకి, బామ్మకి, స్నేహితులకూ కూడా వక్షోజాలు ఉంటాయి నీలాంటి మూర్ఖులకు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు. నా పేజీ నుండి గెట్ ఔట్’ అంటూ కోపంగా రిప్లై ఇచ్చింది విశాఖ సింగ్. 
 
అంతేకాదు ఈ కామెంట్ల వివాదం తీవ్రరూపం చెందడంతో ఆ ఫోటోను తన ఫేస్ బుక్ నుండి తీసివేసి ఆ వివాదానికి తెర దించింది. తన పై ఘాటు కామెంట్స్ చేసిన వారికి విశాఖ సింగ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్..