త్వరలో వినాయక్-మెగా హీరో చిత్రం ప్రారంభం!

0vv-vinayak-and-sai-dharam-tమాస్ సినిమాల దర్శకుడు వివి వినాయక్.. మెగాస్టార్ కంబ్యాక్ మూవీతో తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలాంటిదో చూపించాడు. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఒక మాస్ చిత్రంతో 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం టాలీవుడ్ సాధ్యమే అని ప్రూవ్ చేశాడు వినాయక్. ఆ సినిమా వచ్చిన ఆరు నెలల తర్వాత ఇప్పటికి వినాయక్ కొత్త సినిమా కన్ఫాం అయినట్లు తెలుస్తోంది.

ఈసారి కూడా మెగా ఫ్యామిలీకే వర్క్ చేయనున్నాడు వినాయక్. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ హీరోగా.. ఈ మాస్ డైరెక్టర్ కొత్త సినిమా ప్రారంభం కానుంది. నిజానికి ఫిబ్రవరిలోనే తేజు-వినాయక్ కాంబినేషన్ లో మూవీ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ బడ్జెట్ విషయంలో నిర్మాత టాగూర్ మధుతో ఒప్పందానికి రాలేకపోయాడు ఈ దర్శకుడు. తన పారితోషికం కానీ.. బడ్జెట్ కానీ తగ్గించుకోకపోవడంతో.. తేజుతో అంత బడ్జెట్ కాదనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు మొదలుకాలేదు. కానీ నిర్మాత సి కళ్యాణ్ ఈ కాంబోను ఓకే చేయించగలిగాడు.

ప్రస్తుతం బాలకృష్ణతో 102వ సినిమా చేస్తున్న సి కళ్యాణ్.. వినాయక్ కు భారీ మొత్తం ఆఫర్ చేసి ఈ ప్రాజెక్టును ఓకే చేయించగలిగాడు. ఆకుల శివ రాసిన స్టోరీని ఇప్పటికే ఫైనల్ చేయగా.. దుర్గ అనే టైటిల్ ను కూడా ఖాయం చేసుకున్నారట. ప్రస్తుతం తేజు నటిస్తున్న జవాన్ సెప్టెంబర్ 1న విడుదల కానుండగా.. దుర్గ షూటింగ్ అదే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.