బాలయ్య సినిమా లైన్లో ఉంది: వినాయక్

0డైరెక్టర్ వీ వీ వినాయక్ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగేనని ఫిక్స్ అయిపోయేవారు గతంలో. స్టార్ హీరోలు వినాయక్ తో సినిమా చేసేందుకు ఎప్పుడు రెడీగా ఉండేవారు. కానీ అఖిల్ ఇంటెలిజెంట్ లాంటి సినిమాలతో వినాయక్ మార్కెట్ దాదాపుగా దెబ్బతింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి తో ‘ఖైది నెంబర్ 150’ వచ్చినా ఆ క్రెడిట్ పూర్తిగా మెగాస్టార్ ఖాతా లో పడిపోయింది.

అయినా కొన్ని నెలల క్రితం నందమూరి బాలకృష్ణ – వినాయక్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని నిర్మాత C. కళ్యాణ్ ప్రకటించారు. తాజా గా ఆ సినిమా సైడ్ లైన్ అయిందని – బాలయ్య సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వినాయక్ స్పందిస్తూ బాలయ్య తో తన సినిమా తప్పని సరిగా ఉంటుందని ఎన్టీఆర్ బయోపిక్ పూర్తి కాగానే తమచిత్రం సెట్స్ పైకి వెళ్తుండని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిన వెంటనే బాలయ్య బాబుకు నేరేషన్ ఇస్తానని తెలిపాడు. బాలయ్యను మెప్పించేలా స్రిప్ట్ ను తీర్చి దిద్దుతున్నామని చెప్పాడు.

వినాయక్ ఈ విషయం పై క్లారిటీ అయితే ఇచ్చాడు గానీ బాలయ్యకు ఫైనల్ వెర్షన్ నచ్చలేదంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పక్కకెళ్ళే అవకాశం ఉంది. మరి తన స్క్రిప్ట్ తో బాలయ్యను మెప్పించి అవకాశం అందుకుంటాడో లేదో వేచి చూడాలి.