కొ..ణి..దె..ల అంటున్న కియారా అద్వాని!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – కియారా అద్వానిలు కలిసి నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను స్టైల్ లో చరణ్ మాస్ అవతారం మాస్ ప్రియలను మెప్పించింది.. ఇక ఈ టీజర్ చివరలో చెప్పే ‘ఏయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్. రామ్ కొ..ణి..దె..ల’ అనే డైలాగ్ ఇప్పటికే పాపులర్ అయిపోయింది.

సరిగా ఈ డైలాగ్ తోనే చరణ్ తో కలిసి కియారా డబ్ స్మాష్ చేసింది. కూర్చుని ఉన్న రామ్ చరణ్ “ఏయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంటి.. ఇక్కడ రామ్” అనగానే పక్కనే నిలబడి ఉన్న కియారా అందుకుని “కొ..ణి..దె..ల” అంటూ చరణ్ లాగా చిటికెలు వేస్తూ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అలా పలకడం పూర్తికాగానే పకాపకా నవ్వేసింది. ఈ డబ్ స్మాష్ వీడియో ఇప్పుడు అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదిలా ఉంటే ‘వినయ విధేయ రామ’ టీజర్ యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఒక్క డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారి అఫీషియల్ ఛానెల్ లోనే టీజర్ కు 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2. 4 లక్షల లైకులు వచ్చాయి. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer