W/o రామ్ ట్రైలర్ టాక్

0



టాలీవుడ్ లో థ్రిల్లర్ కథాంశాలు క్లిక్ అయితే తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటాయని కొన్ని సందర్భాల్లో తేలింది. అయితే ఇప్పుడు మంచు లక్ష్మి అదే తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఎప్పుడు లేని విధంగా తొలి సారి ఒక సస్పెన్స్ కథలో మంచు లక్ష్మి కనిపించనుంది. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ట్రైలర్ ను ఈ రోజు మోహన్ బాబు ఆశీర్వాదాలతో లక్ష్మి విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. మంచు లక్ష్మి లీడ్ రోల్ లో తన భర్తకు సంబందించిన మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అనేదే అసలు కథాంశం. నటీనటులు ఎంత మంది ఉన్నప్పటికీ లక్ష్మి పాత్ర ఇందులో హైలెట్ గా నిలుస్తుందని అర్ధమవుతోంది. పోలీసులతో కాకుండా సొంతంగా తన స్టైల్ లో రామ్ భార్య ఇన్వెస్టిగేషన్ ఏమిటనే పాయింట్ సినిమాలో హైలెట్. విజువల్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో ముందే చెప్పడం కొంచెం కష్టం. కానీ ఓ వర్గం వారిని ఈ సినిమా తప్పకుండా థియేటర్స్ వరకు రప్పిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు లక్ష్మి చేసిన చిత్రాలకు బిన్నంగా ఈ కథ ఉండడం మెయిన్ ప్లస్ పాయింట్. బాహుబలి సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీమ్ తో దర్శకుడు విజయ్ యేలకంటి వర్క్ చేశాడు. ఈ సినిమాతో దర్శకుడు పరిచయం అవుతున్న అతను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.