ఈ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను

0kushbu-sundar-waiting-for-rఅగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ నటించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ స్వరాలు అందించారు. కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికల పాత్రలు పోషించారు. ఖుష్బూ సినిమాలోని ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 10న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఖుష్భూ చాలా ఏళ్ల తర్వాత తెలుగులో నటించిన చిత్రమిది. ఇందులో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ఇలాంటి పాత్ర కోసం ఇన్నేళ్లు ఎదురుచూశానని గతంలో ఆమె అన్నారు.

కాగా సినిమా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉన్న సందర్భంగా ఖుష్బూ ట్విటర్‌ వేదికగా తన ఉద్వేగాన్ని తెలిపారు. చిన్నపాప తన తొలి రిపోర్ట్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని చెప్పారు. ‘జనవరి 10న ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతోంది. చిన్న పాప తన తొలి రిపోర్ట్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న భావన కలుగుతోంది. చాలా ఆతృతగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నటించా. ఈ ఎదురుచూపులకు తగిన ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాను. త్రివిక్రమ్‌పై నాకున్న నమ్మకం వమ్ముకాదు. థ్యాంక్యూ పవన్‌కల్యాణ్‌ ఫర్‌ ఎవిరిథింగ్‌’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

‘అజ్ఞాతవాసి’ ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చక్కగా జరిగినట్లు సమాచారం. అమెరికాలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతోన్న తెలుగు సినిమా ఇదేనని చెబుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.