ట్రిప్పీ.. ట్రిప్పీ: తడి తడి అందాలతో సన్నీ..

0



సన్నీలియోన్.. ఈపేరు వింటేనే కుర్రకారు మదిలో సెగలు రేగుతుంటాయ్. ఒకప్పటి పోర్న్‌స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీకి ఉన్న క్రేజే వేరు. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో పాల్గొనేందుకు వచ్చిన సన్నిలియోన్‌ను చూడటానికి ఆమె అభిమానులు జనప్రవాహంలా రావడంతో.. అన్ని రోడ్‌లు రద్దీతో కిక్కిరిసిపోగా వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు పలుసార్లు లాఠీచార్జ్ చేశారంటే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే జిస్మ్ 2 మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సన్నీలియోన్‌ ఐటమ్ సాంగ్స్‌తో ఆకట్టుకుంటుంది. రయీస్ సినిమాలో షారూఖ్ ఖాన్‌తో కలసి చిందేసిన ఈ చిన్నది తాజాగా సంజయ్ దత్ మెయిన్ లీడ్‌ చేస్తున్న ‘భూమి’ సినిమాలో ‘ట్రిప్పి ట్రిప్పి’ అంటూ ఒక ఐటెం సాంగ్‌ చేస్తుంది. ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఈ సాంగ్‌లో సన్నీ తడి తడి అందాలతో కుర్రకారులో కాకరేపుతోంది.

ఒంటినిండా మట్టిపూసుకుని.. నీటిలో తడుస్తూ.. మాస్ స్టెప్పులతో మత్తెక్కిస్తుంది ఈ హాట్ బ్యూటీ. సన్నీకి ఉన్న క్రేజ్‌తో ఈ పాట కోసమైనా ‘భూమి’ సినిమాకు పంబరేపే ఓపెనింగ్ కలెక్షన్స్ ఖాయం అంటున్నారు సన్నీ అభిమానులు. మరోవైపు తెలుగులో సన్ని లియోన్ రాజశేఖర్ హీరోగా రూపొందిన ‘గరుడ వేగ’లో ఓ హాట్ బీట్ మాస్ మసాలా ఐటమ్ సాంగ్‌‌తో మెరుస్తుండటంతో తెలుగులో ట్రిప్పీ.. ట్రిప్పీ ఎప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు సన్నీఫ్యాన్స్.