నడుము చూపిస్తే తప్పు…బికినీ వేయడం తప్పు కాదా…

0Tapsee-Bikiniసినిమాల్లో అమ్మాయిలని కేవలం గ్లామర్ కోసమే వాడుకోవడం తప్పు అని, మాటిమాటికి నడుము చుట్టూ కెమెరా పెట్టడం, నడుముని పూలతో పళ్లతో కొట్టడం విడ్డూరమని దర్శకుడు రాఘవేంద్రరావు ని ఉద్దేశించి తాప్సి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని సృష్టించాయో మీకు గుర్తుక ఉండే వుంటుంది. తాను ఒకప్పుడు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి గ్లామర్ షో చేశానని, కానీ ఇకనుంచీ గ్లామర్ పాత్రలు చేయాల్సిన అవసరం తనకు లేదని పలుమార్లు వ్యాఖ్యానించింది తాప్సి. కట్ చేస్తే, ఇప్పుడు జుడ్వా 2 అనే బాలీవుడ్ సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తోంది తాప్సి. బికినీ సన్నివేశాలు చేసింది అలాగే ముద్దు సన్నివేశాలు కూడా చేసింది.

హీరోయిన్ నడుము ని వివిధ భంగిమల్లో చూపించడం తప్పు అని చెప్పిన తాప్సీ, బికినీ వేయడం మాత్రం నేరం కాదని అంటోంది. బికినీ వేయడం మామూలు విషయం కాదు, బికినీ వేస్తే అది నప్పేలా ఉండే శరీరాకృతి కావాలి, అలాంటి బాడి కోసం ఎంతో కష్టపడాలి. బికినీ వేయడం అంటే చిన్న విషయం కాదు అని అభిప్రాయ పడుతోంది.

“నామ్ షబానా” చిత్రం కోసం సన్నగా తయారయ్యాను. కానీ జుడ్వా 2 లో నాది కొంచెం గ్లామరస్ పాత్ర. బికినీ వేయాలి, అలాగే సెక్సీగా ఉండే ఆకృతిలో కనిపించాలి. అలాగని చెప్పి బరువు ఎక్కువగా పెరగకూడదు. ఇలా కొలతలు కొలిచి కొంచెం బరువు పెరిగాను. అందువల్లే నా బికినీ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. నేను ఈ సినిమాలో బికినీ ఎందుకు వేశానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అయినా బికినీ వేయడం నేరం కాదు’ అంటూ మాట మార్చేసింది తాప్సీ.