బోల్డ్‌గా నటిస్తే తప్పేంటి: తేజస్విని

0Tejaswini-madivadaసీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తేజస్విని మదివాడకు హీరోయిన్‌గా మంచి పేరు వచ్చింది. కానీ అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. శృంగారతారగా ముద్ర పడినందునే అవకాశాలు దూరమయ్యాయనే వాదనను తేజస్విని ఖండించింది. ప్రస్తుతం బాబు బాగా బిజీతో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న తేజస్వీని మీడియా అలాంటి అభిప్రాయాలను ఏర్పరుచుకోవడం తగదని స్పష్టం చేసింది.

వచ్చిన అవకాశాలను, కథను బట్టి పాత్రల ఎంపిక జరుగుతుంది. సిరిమల్లే చెట్టు చిత్రం ద్వారా మంచి పేరు వచ్చింది. కాకపోతే తొలి చిత్రంలో సపోర్టింగ్ పాత్ర చేయడంతో అలాంటి పాత్రలే వస్తున్నాయి. రాంగోపాల్ వర్మ రూపొందించిన ఐస్‌క్రీం సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.

సినిమా కథ ఎలా ఉంటే అలా నటిస్తాను. ఐస్‌క్రీం సినిమాలో కథను బట్టి హాట్ హాట్‌గా కనిపించాల్సి వచ్చింది. అలా నటించడంలో తప్పు లేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో చాలావరకూ పద్ధతిగానే కనిపించాను. ‘మనం’, ‘హార్ట్‌ఎటాక్‌’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. వాటిని ఎవరూ గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. దిల్‌రాజు నిర్మించిన ‘కేరింత’లోని పాత్రకు నాకు మంచి పేరొచ్చిన దానిని ఎవరూ గుర్తించరే అని ఆవేదన వ్యక్తం చేశారు

ప్రస్తుతం నటించిన బాబు బాగా బిజీ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ ఏడాది అవకాశాలు బాగా రావడంతో చాలా బిజీ అయిపోయాను. ఖాళీగా అయితే లేను. ఏదో ఒక క్యారెక్టర్‌ చేస్తూనే ఉన్నాను. కానీ హీరోయిన్‌గా రావలసినంత గుర్తింపు రాలేదనే కొద్దిగా బాధ. కెరీర్ పరంగా నేను సంతోషంగా ఉన్నాను తేజస్వీ తెలిపింది.

సినీ పరిశ్రమలో టైమ్ అనేది చాలా ప్రధానం. అవకాశాలతోపాటు స్టార్ హోదా రావడానికి టైం రావాలి. అందుకోసమే వేచిచూస్తున్నాను. ఆలస్యమైనా నా ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.