త్వరలో ‘వాట్సాప్‌ బిజినెస్‌’ యాప్‌

0watsappసోషల్‌ మీడియా రంగంలో పెను విప్లవం సృష్టించిన వాట్సాప్‌ తాజాగా ‘వాట్సాప్‌ బిజినెస్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పరిశ్రమ వర్గాలు దీన్ని పరీక్షించాయి. ఇదో స్వతంత్ర యాప్‌. ప్రస్తుతం వినియోగిస్తున్న ‘వాట్సాప్‌’నకు ఇది భిన్నంగా ఉంటుందని వాట్సాప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మట్‌ ఇడెమా పేర్కొన్నారు. అన్ని సేవలను మరింత మెరుగు పరచుకునేందుకు ‘ప్లేస్టోర్‌’లో వినియోగదారుల అభ్యర్థనను కోరామని పేర్కొన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, దాని ద్వారా ఆదాయాన్ని పొందితే భవిష్యత్తులో రుసుము వసూలు చేస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం ‘బుక్‌ మై షో’లో టికెట్‌ను పొందేందుకు వినియోగదారులు వాట్సాప్‌ వినియోగిస్తున్నారు. వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ పూర్తిగా వాట్సాప్‌ను పోలి ఉన్నప్పటికీ ఇందులో ఆకర్షణీయ ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వాట్సాప్‌ లోగోలో ఉన్న కాలింగ్‌ సింబల్‌లో ఆకుపచ్చ రంగులో ‘బి’ అక్షరం ఉంటుంది. ఆటోరెస్పారెన్స్‌, బిజినెస్‌ ప్రొఫైల్‌ను తయారు చేసుకోవడం, చాట్‌ మైగ్రేషన్‌, విశ్లేషణలు తదితర సేవలు ఇందులో ఉన్నాయి.