పోలీసులకు చిక్కిన సామ్

0చిన్ననాటి జ్ఞాపకాలు – అనుభూతులు అంత తేలిగ్గా మర్చిపోలేం. పెరట్లో జామచెట్టు ఎక్కి చిలక్కొట్టిన దోర జామకాయను తెంపుకున్న రోజుల్ని బంతిపూల తోటలో లిల్లీ బ్యూటీతో సరసమాడిన తీపి జ్జాపకాన్ని అంత తేలిగ్గా మర్చిపోగలమా? అలానే అక్కినేని వారి కోడలు సమంతకు కొన్ని జ్ఞాపకాలున్నాయ్. అవి తనని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ తన నేటివ్ ప్లేస్ చెన్నయ్ పరిసరాల్లోనివి కావడంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టాటస్ లో సమంత ఒక్కొక్కటిగా మీడియా ముందే గుర్తు చేసుకుంటోంది.

అలా ఓసారి తాను చేసిన ఓ చిలిపి పనిని గుర్తు చేసుకుంది. “నేను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో ఎంతైనా తిరగొచ్చని నాన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పనేం ఉంటుంది? అందుకే స్వేచ్ఛగా తిరిగేసేదాన్ని. ఓసారి ఎవరికీ చెప్పకుండా – లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్లిపోయాను. పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు. ప్లీజ్ ప్లీజ్! అంటూ రెక్వస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నాను“ అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది.

చెన్నయ్లో `యూటర్న్` ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంత ఇలా ఎన్నో సంగతుల్ని మాట్లాడింది. బాల్యంలోని ఈ మెమరీ బాగానే ఉంది కానీ – అప్పటికి హెల్మెట్ నిబంధన అంతగా లేదు కాబట్టి సామ్ వితౌట్ హెల్మెట్ ప్రయాణించి ఉంటుందేమో? ఆ సంగతిని చెప్పనేలేదు. సామ్ నటించిన `యూటర్న్`తో పాటు `సీమరాజా` సెప్టెంబర్ 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఒకేరోజు రెండు రిలీజ్ లు.. అంటే తంబీ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ అన్నమాట!!