స‌న్నీ లియోన్‌కు ఇష్టమైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా?

0sunny-leoneబాలీవుడ్ సెక్స్ బాంబ్ స‌న్నీ లియోన్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మ‌రి అలాంటి స‌న్నీ కూడా ఒక‌రికి వీరాభిమాని అన్న విష‌యం తెలుసా? తాజాగా ట్విట్ట‌ర్‌లో స‌న్నీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మీ ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు? అని ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె సమాధాన‌మిచ్చింది. అయితే చాలా మంది క్రికెట్ ఫాలోవ‌ర్స్ చెప్పే స‌చిన్‌, విరాట్ పేర్లను ఆమె చెప్ప‌లేదు. టీమిండియా మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ ధోనీ త‌న అభిమాన క్రికెట‌ర్ అని స‌న్నీ చెప్పింది. ఈ ఐపీఎల్‌లో అత‌ను పెద్ద‌గా రాణించ‌క‌పోయినా.. ధోనీ ప‌ట్ల ఉన్న అభిమానం ఏమాత్రం త‌గ్గ‌లేద‌నీ ఆమె స్ప‌ష్టంచేసింది. ఈ మ‌ధ్యే క‌మెడియ‌న్ సునీల్ గ్రోవ‌ర్‌తో క‌లిసి స‌న్నీ ఐపీఎల్ కామెంట‌రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

@sunnyleone #AskSunny which is your
fav. cricket team & Player..?! #AskSunny

— Ganesh Kumar (@Ganesh_twits) 4 October 2016

@GaneshK2410 favorite team is obviously india and player – Dhoni #AskSunny

— Sunny Leone (@SunnyLeone) 4 October 2016