క్రిష్ రిజిస్టర్ చేయించిన కొత్త టైటిల్

0Krish-speechఈ సంక్రాంతికి బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో హిట్ కొట్టిన క్రిష్ తదుపరి ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘శాతకర్ణి’ తరువాత విక్టరీ వెంకటేష్‌తో మూవీ ప్లాన్ చేశాడు క్రిష్. కానీ.. ఆ మూవీ మొదలు కాకుండానే ఆగిపోయింది.వెంకటేష్, క్రిష్ కలయికలో ఓ సినిమా ప్లాన్ జరిగింది. వెంకీ కోసం క్రిష్ ఓ న‌వ‌ల‌ని సినిమాగా తీద్దామ‌ని భావించారు.

‘అత‌డు అడ‌విని జయించాడు’. కేశ‌వ‌రెడ్డి ర‌చించిన ఈ నవలకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ నవల కాపీ రైట్స్ తీసుకోవాలని అనుకున్నారు క్రిష్. కానీ ఇంతలోనే మరో వ్యక్తి ఆ నవల హక్కులను సొంతం చేసుకోవడంతో వెంకీ సినిమా డ్రాప్ అయింది. తర్వాత కళ్యాణ్ రామ్ తో చేస్తున్నాడనీ వార్తలు వచ్చాయ్ కానీ అదీ మొదలవకుందానే ఆగిపోయింది.

క్రిష్ తన సొంత బ్యానర్ పై “చోర” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు? క్రిష్ ఎవరికోసం ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు అన్నది ఇప్పుడు హాటేస్ట్ టాపిక్. అన్నట్టు… ఈ మద్యే క్రిష్, చిరంజీవి తో కలిసి ఓ సినిమా చేసేందుకు క్రిష్ మంతనాలు జరిపాడని తెలిసింది.

మరి ఓ వైపు కళ్యాణ్ రామ్, మరో వైపు చిరంజీవి ఇలా వరుసగా హీరోలతో చర్చలు జరుపుతున్న క్రిష్ .. చోర టైటిల్ ఎవరికోసం రిజిస్టర్ చేసాడో అన్నది ఆసక్తికరంగా మారింది ? ఇన్నాళ్లు క్రిష్ తీసిన సినిమాలకు భిన్నంగా చోర సినిమా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే ఔట్ అండ్ ఔట్

కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుందట. ఈ మేరకు ఇండస్ట్రీలో వరుసగా హిట్స్ కొడుతున్న ఓ మీడియం రేంజ్ హీరోతో క్రిష్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మొదటి నుంచి కూడా క్రిష్ వైవిధ్యభరితమైన కథాంశాలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఆయన సినిమాలు వినోదాన్ని అందించడంతో పాటు, ఏదో ఒక సందేశాన్ని మోసుకొస్తూ ఆలోచింపజేసేవిగా వుంటాయి. అయితే ఈ సినిమాతో తాను కొత్త దారిలోకి మళ్ళనున్నాడన్న మాటకూడా వినిపిస్తోంది. చూద్దాం మరి క్రిష్ చేసే ఈ చోర ప్రయోగం ఎలా ఉండబోతోందో.