వీళ్లే టాలీవుడ్ హాటీస్.. మరి విన్నర్?

0హాట్ బ్యూటీ ఇమేజ్ అంటే ఏ హీరోయిన్ అయినా తెగ ఇష్టపడుతుంది. బాలీవుడ్ సంగతి కాసేపు పక్కన పెడితే.. దక్షిణాది వరకు మాత్రం టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ అనిపించుకునే గ్లామర్ ఇమేజ్ కోసం అందాల భామలు తెగ తహతహలాడుతుంటారు. ఇందుకు కారణాలు చాలానే ఉంటాయి. అయితే.. మరి ప్రస్తుతం టాప్ హాటీ ఎవరు అంటే.. సమాధానం ఎలా దొరుకుతుంది?

ఫ్యాన్స్ అయితే తాము ఎవరిని అభిమానిస్తే వారి పేరు చెబుతారు. అందుకే మాగ్జిమ్ ఇండియా మేగజైన్ ఇప్పుడు ఓ పోల్ నిర్వహిస్తోంది. మేగ్జిమ్ హాటీ 2018 అంటూ అందాల భామలను జల్లెడ పడుతోంది. 100 మంది సెలబ్రిటీలను ఇందులో చేర్చగా.. ఈ లిస్టులో దాదాపు టాలీవుడ్ హీరోయిన్స్ అంతా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. డీజే లో బికినీతో రచ్చ చేసిన పూజా హెగ్డే.. స్టార్ స్టేటస్ కు ఇంచ్ దూరంలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. మిల్కీ బ్యూటీ తమన్నా.. వీరంతా రేసులో చాలా ముందున్నారు.

ఇక అదితి రావు హైదరి.. ఆదా శర్మ.. అమైరా దస్తూర్.. అమలా పాల్.. హ్యూమా ఖురేషి.. రాధికా ఆప్టే.. ప్రియమణి.. శ్రియా శరణ్.. శృతి హాసన్.. శోభిత ధూళిపాళ.. తాప్సీ వంటి భామలు కూడా హాటీ 2018 రేసులో ఉన్న సుందరాంగులే. వీరిలో కొందరు బాలీవుడ్ భామలు.. అక్కడ సెటిల్ అయిన వారున్నా.. తెలుగు సినిమాలు చేసిన వారు కాబట్టే.. టాలీవుడ్ లిస్ట్ లో చేర్చడం జరిగింది. జ్వాలా గుత్తా.. మిథాలీ రాజ్.. వంటి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కూడా హాటీ లిస్ట్ లో ఉండడం విశేషం. వీరిలో టాప్ హాటీ అనిపించుకునే ఆ విన్నర్ ఎవరో త్వరలోనే మేగ్జిమ్ మేగజైన్ ప్రకటించనుంది. అయితే.. ఈ జాబితాలో ఎక్కడా టాప్ బ్యూటీ సమంత పేరు కనిపించనే లేదు గమనించారా?