లోకేష్‌ ఆ శాఖలను ఎందుకు తీసుకున్నాడో తెలుసా?

0nara-lokeshఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా తన మంత్రి వర్గంలోకి 11 మందిని కొత్తగా తీసుకున్న విషయం తెల్సిందే. వారితో తాజాగా గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఇక నేడు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడం, మరియు పాత మంత్రుల శాఖల మార్పు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక కొత్త మంత్రుల అందరి శాఖల గురించి పక్కన పెడితే చంద్రబాబు తనయుడు లోకేష్‌కు పంచాయితీ రాజ్‌, ఐటీ, గ్రామీణ అభివృద్దికి సంబంధించిన శాఖలు దక్కాయి.

ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ వద్ద కూడా ఇవే శాఖలు ఉన్నాయి అనే విషయం తెల్సిందే. ఎందుకు ప్రత్యేకంగా పంచాయితీ రాజ్‌ మరియు గ్రామీణ అభివృద్ది శాఖలను వీరిద్దరు ఎంచుకున్నారు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతుంది. వీరిద్దరు కూడా యువ నేతలు, భవిష్యత్తులో సీఎం కావాలని కలలు కంటున్నారు వారు. అందుకే వీరిద్దరు కూడా ప్రజలకు చాలా దగ్గరగా, ఎక్కువ పని చేస్తున్నట్లుగా, ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉండాలి.

అందుకు ఈ శాఖలు బాగా ఉపయోగపడతాయి. పంచాయితీ రాజ్‌ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు వస్తాయి. ప్రతి రాష్ట్రం పంచాయితీ రాజ్‌ శాఖకు కేంద్రం భారీగా నిధులు విడుదల చేస్తుందని, ఆ నిధులు వృదా కాకుండా జాగ్రత్తగా ఖర్చు చేసేందుకు ఆ శాఖను వీరిద్దరు తీసుకున్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. ఇక ఐటీ మరియు గ్రామీణ అభివృద్ది శాఖలు కూడా ప్రతిభను వెలికి తీసేదిగా ఉంటాయి. అందుకే వీరిద్దరు కూడా ఆ శాఖలను ఎంచుకున్నారు.