సుమ కాళ్లు మొక్కిన రానా ఎందుకంటే..!

0

స్టార్ హీరోలకు సంబంధించిన ఏ సినిమా కార్యక్రమం జరగాలి అన్నా కూడా యాంకర్ గా సుమ రావాల్సిందే. సుమ డేట్ కోసం కూడా కొందరు వెయిట్ చేసి తమ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఎంత పారితోషికం అయినా కూడా సుమకు ఇచ్చి తమ కార్యక్రమంను సుమ చేతిలో పెట్టాలని భావించే నిర్మాతలు ఎంతో మంది. కార్యక్రమంను సమయస్ఫూర్తితో చాలా హుందాగా ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా సినిమా థీమ్ తో కార్యక్రమంను ముందుకు తీసుకు వెళ్లడంలో సుమ ధిట్ట. తాజాగా సుమ ‘జెర్సీ’ థ్యాంక్స్ మీట్ కు యాంకర్ గా వ్యవహరించింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా మాట్లాడుతూ నాకు క్రికెట్ పెళ్లి పిల్లలు అంటే పడవు అవి నాకు అసలు అర్థం కావు సెంటిమెంట్ లు పెద్దగా లేని నాతో ఈ చిత్రం కన్నీరు పెట్టించింది. నాకే కన్నీరు పెట్టిస్తే ప్రేక్షకుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెడీగా రానా వ్యాఖ్యలు చేశాడు. రానా అలా మాట్లాడిన సమయంలోనే సుమ కల్పించుకుని ముందుగా మీకు జెర్సీ థ్యాంక్స్ మీట్ కు వచ్చినందుకు థ్యాంక్స్ మీకు త్వరలోనే అమ్మాయి పిల్లలు అంటే ఏంటో తెలియాలని వారు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను అంది.

సుమ మాటలకు వెంటనే సరే ఆశీర్వదించండి అంటూ సుమ కాళ్లకు రానా దండం పెట్టబోయాడు. రానా వంగబడి కాళ్లకు దండం పెట్టబోతున్న సమయంలో షాక్ అయిన సుమ ఠక్కున వెనక్కు జరిగింది. దండం పెట్టి అక్కడ నుండి వెళ్లి పోతున్న రానాపై మరో పంచ్ ను కూడా సుమ వేసింది. వీరందరు పెళ్లి చేసుకుని కష్టాలు పడుతుంటే మీరు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి అందుకే త్వరలోనే మీరు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. సుమ రానాల మద్య జరిగిన ఈ సన్నివేశం కార్యక్రమంకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతా కూడా చాలా సమయం నవ్వుకున్నారు. సుమ సమయస్ఫూర్తికి ఇదో నిదర్శణంగా చెప్పుకోవచ్చు.
Please Read Disclaimer