వెంకటేష్ చరణ్ తో ఎందుకు నటిస్తున్నాడు?

0ramcharan-krishna-venkateshకృష్ణ వంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాతగా ప్రారంభం కాలసిన మల్టీస్టారర్ సినిమా విషయంలో రకరకాల సందిగ్ధం సృష్టించి చివరకు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి వెంకటేష్ తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అతను తప్పుకోవడానికి కారణం స్క్రిప్ట్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్న ట్రాక్ రికార్డ్ ఒక్క వెంకటేష్ కే సొంతం. అతను కాదంటే మరో సీనియర్ హీరో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపరు.

ఈ తరుణంలో మొదట్లో ఈ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసే ముందు వెంకటేష్ తను రామ్ చరణ్ సినిమా చేయాలంటే చరణ్ కు ఇస్తున్న పారితోషికం కంటె ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై బండ్ల గణేష్ ఆలోచిస్తున్న నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ నుండితప్పుకుంటున్నట్లు వెంకటేష్ నిర్మాత బండ్ల గణేష్ తో అన్నాడు.

ఇప్పటికే రామ్ చరణ్ డేట్స్ ఉండి కథ సిద్దంగా ఉండీ కూడా ఈ సినిమాను ప్రారంభించడంలో ఆలస్యం జరుగుతుండటం తో వెంకటేష్ విదేశాల నుండి తిరిగి వచ్చిన వెంటనే బండ్ల గణేష్ వెంకీని కలసి అతను కోరిన పారితోషికం ఇవ్వడానికి బండ్ల గణేష్అంగీకరించాడట.  దాంతో దివాళి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ తను రామ్ చరణ్ తో నటిస్తున్నట్లు అధికారికంగా చెప్పాడని దీని వెనుక ఇంత తతంగం నడిచిందని పరిశ్రమలో మాటలు వినిపిస్తున్నాయి.