విన్నర్ ట్రైలర్ విడుదల వాయిదా!

0Winner-Rakul-and-Sai-lookమెగాహీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తేజ్ కెరీర్లోనే మంచి కమర్షియల్ సినిమాగా నిలుస్తుందని సినీ వర్గాల్లో బలమైన టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అది కాస్త రద్దయినట్టు తెలుస్తోంది.

కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్లనే ఈ క్యానిలేషన్ జరిగినట్టు చెబుతున్నారు. అయితే చిత్ర టీమ్ నుండి ట్రైలర్ వాయిదా గురించి గాని, కొత్త విడుదల తేదీ పై గాని ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఇకపోతే ఈ నెల 19న భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు చిత్ర టీమ్. ఇప్పటికే థమన్ సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది.