2 లక్షలకే అంత గుర్తుపెట్టుకున్న స్టార్

0

పేరుకు అందరు స్టార్లని అంటారు కానీ ఆ ట్యాగ్ కు తగ్గ లక్షణాలు అందరిలోనూ ఉండవు. అలా ఉన్న వాళ్ళు వందల సినిమాలు చేసినా తొణకని వ్యక్తిత్వంతో ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అందులో చెప్పుకోవాల్సిన పేరు తలా అజిత్. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం దర్శకుడు రాజీవ్ మీనన్. ఇటీవల కోలీవుడ్ నటులు చేపట్టిన ఓ నిరసన కార్యక్రమంలో అజిత్ పాల్గొన్నాడు. అక్కడికి వచ్చిన రాజీవ్ మీనన్ విష్ చేయగా బదులిచ్చిన అజిత్ పక్కనే స్నేహితుడికి పరిచయం చేస్తూ రాజీవ్ మీనన్ ను చీఫ్ గా ఈయన లేకుంటే నేను ఈ రోజు స్టార్ ని కాను అని చెప్పడం విని అక్కడే ఉన్న అందరూ షాక్ అయ్యారు.

రాజీవ్ మీనన్ దర్శకుడిగా అజిత్ ల కాంబోలో వచ్చింది ఒక్క సినిమానే. అది ప్రియురాలు పిలిచింది. అదేమంత గొప్ప విజయం సాధించలేదు.పైగా పేరు మొత్తం మమ్ముట్టి టబు ఐశ్వర్య రాయ్ పంచేసుకున్నారు. అందుకే అజిత్ ఇలా ఎందుకు అన్నాడా అని ఆశ్చర్యపోయిన రాజీవ్ కు సమాధానం దొరికింది

అజిత్ కెరీర్ లో అతి పెద్ద బ్రేక్ గా చెప్పుకునే వాలి విడుదల సమయంలో రెండు లక్షల డబ్బు అవసరం పడింది. అప్పుడు అజిత్ దగ్గర అంత సొమ్ము లేదు. దీంతో రాజీవ్ మీనన్ ను అడగ్గానే ఎక్కువ ఆలోచించకుండా సర్దేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అజిత్ పేరు మారుమ్రోగిపోయింది. దెబ్బకు వారం లోపే ఆ రెండు లక్షలు రాజీవ్ మీనన్ కు అజిత్ తిరిగి ఇచ్చేశాడు.

అది గుర్తుపెట్టుకుని ఆ రోజు వాలి విడుదలకు రాజీవ్ సహాయం చేయకుండా వాలి ల్యాబ్ లోనే ఆగిపోయి ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడినా అంటూ అజిత్ చెప్పడం విని రాజీవ్ కు నోటమాట రాలేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం తీసుకున్న డబ్బుకు ఈ రోజుకీ కృతజ్ఞత చూపించడం అంటే అందరి వల్ల అయ్యే పనేనా. అందుకే అజిత్ అంటే అభిమానులకు అంత ప్రాణం
Please Read Disclaimer