మార్కెట్లోకి షియోమీ గేమింగ్ ఫోన్..

0ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకున్న షియోమీ..తాజాగా గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేక గేమింగ్ స్మార్ట్ ఫోన్ ను తీసుకరాబోతుంది. బ్లాక్ షార్క్ పేరిట‌ ఓ నూత‌న‌ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు చెందిన పలు టీజర్ ఇమేజ్‌లను షియోమీ విడుదల చేయగా వాటి పట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఇక ఈ గేమింగ్ ఫోన్ ఫీచర్స్ చూస్తే..

* అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
* 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
* ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండనున్నట్లు తెలుస్తుంది.