ఆ రెండు బయోపిక్ లలో నటించాలని ఉంది

0బాలీవుడ్ లో మొదలైన బయోపిక్ ల పర్వం టాలీవుడ్ లో కంటిన్యూ అవుతోంది. నార్త్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన సైడ్ కూడా అద్భుతమైన నిజ జీవిత కథలు ఉన్నాయంటూ మన దర్శకులు ఛాలెంజ్ గా తీసుకొని మరి సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం మహానటి అందుకు నిదర్శనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక స్త్రీ కథతో మొదలు పెట్టి టాలీవుడ్ చాలా గొప్పది అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది మన ఇండస్ట్రీ.

ఎమోషన్ కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగితే ఎంతో మంది గొప్ప గొప్ప స్త్రీల జీవిత కథలను తెరపై అద్భుతంగా చూపించవచ్చు. ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ బయోపిక్ కథలు వస్తే ఏ మాత్రం నో చెప్పడం లేదు. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామి గౌతమ్ కూడా బయోపిక్ కథలు తన దగ్గరికి వస్తే ఎంత మాత్రం నో చెప్పను అంటోంది. ‘ముఖ్యంగా ఓ ఇద్దరి బయోపిక్ లో నటించాలని ఉందని తెలిపింది. ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా జీవిత కథలో నటించాలని ఉంది. అలాగే మరొకరి కథలో కూడా నటించాలని ఉంది.

గ్రేటెస్ట్ హీరోయిన్ మధుబాల బయోపిక్ లో నటించే అవకాశం వస్తే ఎంత మాత్రం నో చెప్పలేను’ అని యామి ఆ రెండు కథలు తనకు ఇష్టమని చెప్పింది. ఆ రెండు కథలే ఎందుకని అడిగితే.. ఏమో తెలియదు. కానీ వారి ఫీల్డ్ లో చూపించిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అందుకే వెరీ ఇన్స్పిరేషనల్ అని యామి వివరణ ఇచ్చింది.