జగన్ పుట్టిన రోజున ‘యాత్ర’ రిలీజ్

0మమ్ముట్టి హీరోగా వస్తున్న యాత్ర సినిమాను దివంగత సీఎం రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని ఇంతకాలం చెబుతూ వచ్చారు. అయితే… ఇప్పుడీ సినిమాను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నారట. జగన్ పుట్టిన రోజు సందర్బంగా దీన్ని విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

ఏటా జగన్ పుట్టిన రోజు డిసెంబరు 21న అభిమానులు సందడి చేస్తారు. అందుకే అభిమానులకు కానుకా యాత్ర సినిమాను అదే రోజున విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నరట. మరోవైపు సంక్రాంతికి పక్కా కమర్షియల్ సినిమాలు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో అదే అదనుగా రాజకీయ కారణాలతో దీనికి థియేటర్లు దొరకకుండా చేసే ప్రమాదం ఉందన్న అనుమానాలూ నిర్మాతల్లో ఉణ్నాయి. అందుకే ఆ ఇబ్బందులను తప్పించుకోవడానికి ముందే విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

సంక్రాంతికి రామ్ చరణ్-బోయపాటి సినిమా ఒకటి ఇప్పటికే జనవరి 9న డేట్ ఇచ్చివుంది. బాలయ్య-ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి విడుదల. ఇక ఇవికాక దిల్ రాజు నిర్మించే మల్టీ స్టారర్ ఎఫ్-2 కూడా సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నికంటే ముందుగానే యాత్ర సినిమాను విడుదలచేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మూడు వారాల ముందుగానే అభిమానులను అలరించనుంది.