సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఆన్ లైన్ ‘యాత్ర’ మొదలైంది

0

నెల రోజులకే కొత్త సినిమాలను స్ట్రీమింగ్ లో పెట్టే విషయంలో అమెజాన్ ప్రైమ్ ఏ మాత్రం తగ్గడం లేదు నిన్న అర్ధరాత్రి నుంచి యాత్ర ఆన్ లైన్ లో హెచ్డి క్వాలిటీతో అందుబాటులోకి వచ్చేసింది. సరిగ్గా 30 రోజులకు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రేక్షకుల కోసం తీసుకొచ్చింది. చిన్న కేంద్రాల్లో యాత్ర ఫైనల్ రన్ పూర్తి చేసుకున్నప్పటికీ ప్రధాన సెంటర్స్ లో ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రైమ్ విడుదల జరిగిపోయింది కాబట్టి వీటి మీద ప్రభావం ఉండటం ఖాయం.

స్వర్గీయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలోని అతి కీలకమైన ఘట్టంతో రూపొందిన యాత్రకు మహి వి రాఘవ దర్శకుడు. అప్పటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా ఎమోషనల్ గా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను మెప్పించేలా చేసింది. బాక్స్ ఆఫీస్ వసూళ్ళ పరంగా మరీ అద్భుతాలు చేయలేకపోయినా ఓ మోస్తరుగా మంచి మార్కులతోనే యాత్ర బయట పడింది. థియేటర్ దాకా వెళ్ళే అవకాశం సౌలభ్యం లేని వాళ్ళకు ఇంత తక్కువ టైంలోనే యాత్ర ఆన్ లైన్ లో చూసే ఛాన్స్ వచ్చేసింది.

మమ్ముట్టి సహజమైన నటన రావు రమేష్ అనసూయ లాంటి ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వెరసి యాత్ర రాజకీయ నాయకుడి సినిమాగా కన్నా ఓ జన నాయకుడి కథగా మెప్పు పొందింది. కొత్త సంవత్సరంలో బాగా దూకుడు మీదున్న అమెజాన్ ప్రైమ్ వదిలిన యాత్రతో పాటు తమిళ్ లో మముట్టి చాలా ఏళ్ళ తర్వాత హీరోగా నటించిన పెరంబు కూడా అందుబాటులోకి రావడం విశేషం. ఇది కూడా ఇంచుమించు యాత్ర టైంలోనే రిలీజై విమర్శకుల ప్రశంసలు అందుకుంది
Please Read Disclaimer